ఢిల్లీ అల్లర్లు : ‘వాట్సాప్ గ్రూప్’పై కేసు నమోదు

ఢిల్లీ అల్లర్ల సమయంలో మత విద్వేశాలు రెచ్చగొడుతున్న ఓ వాట్సాప్ గ్రూప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘కట్టర్ హిందూ ఏక్తా’ పేరుతో రూపొందించిన ఈ గ్రూప్ మరో మతానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ గ్రూప్ లోని మెసేజ్ లు, ఫొటోలను పరిశీలించారు. ముస్లిం మతానికి సంబంధించిన మసీదు, మదర్సాలను ధ్వంసం చేయాలని, ముస్లింలను చంపేయాలని ఈ గ్రూపులో చర్చించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వివరాలతో పోలీసులు సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో పొందుపరిచి కోర్టుకు నివేదించారు. 

ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరి 24న మత ఘర్షణలు జరిగిన మరుసుటి రోజు అంటే ఫిబ్రవరి 25న ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయినట్లు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్ చాట్ ప్రకారం ముస్లింలను చంపడానికి కుట్ర పన్నినట్లు ఉందన్నారు.. కాగా ఢిల్లీ మత ఘర్షణకు సంబంధించి ఇప్పటి వరకు 751 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. 1571 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 250 చార్జ్ షీట్లలో 1153 మందిని నిందుతులుగా చేర్చారు.  

 

Leave a Comment