ఏపీలో వంట గ్యాస ధరలు భారీగా పెంపు..!

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు షాక్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ పై వ్యాట్ ను పెంచింది. ఇప్పటి వరకు 14.5 శాతం ఉన్న వ్యాట్ ను 24.5 శాతానికి పెంచుతున్నట్లు నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా ఏపీ రెవెన్యూ భారీగా పడిపోయింది. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అధికంగా ఖర్చు చేసింది. దీంతో రాష్ట్ర అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 ఏపీలో రెవెన్యూ పెంచుకునేందుకు వంట గ్యాస్ పై వ్యాట్ పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏకంగా 10 శాతం అదికంగా వ్యాట్ ను పెంచింది. వ్యాట్ పెంపుతో ఏపీలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరగనున్నాయి. కరోనా కష్టకాలంలో ఆర్థిక భారంతో అవస్థలు పడుతున్న ప్రజలకు ఇక గ్యాస్ పెరుగుదల గుదిబండలా మారింది. 

ఇక ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షమ పథకాలను ఆర్థిక వేత్తలు మొదటి నుంచి వ్యతిరేకిస్తునే ఉన్నారు. సంక్షమ పథకాలు ఎక్కువైతే వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వుం అప్పుల్లో కూరుకుపోతుందని అన్నారు. ఏపీలో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.  రైతు భరోసా, నాడు-నేడు, టెలి మెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మ ఒడి లాంటి పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున వంట గ్యాస్ పై పన్ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

 

Leave a Comment