పేద విద్యార్థులకు సోనూ సూద్ స్కాలర్ షిప్స్.. కానీ ఒక షరతు!

సోనూ సూద్ పేదల పాలిట దేవుడి అవతారం ఎత్తాడు. ఏ సెలబ్రెటీ చేయని సాయాన్నిపేద ప్రజలకు చేస్తున్నాడు. లాక్ డౌన్ లో వలస కార్మికుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా వేదికగా అవసరాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. తాజాగా మరో పనికి శ్రీకారం చుట్టారు. మరణించిన తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించబోతున్నాడు. స్కాలర్ షిప్ కు [email protected] ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

రూ.2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసే విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుని ఉండాలని షరతు పెట్టాడు. అటువంటి వారికి కోర్సు ఫీజు, వసతి, ఆహారం అన్ని తానే చూసుకుంటానని ప్రకటించారు. ఇందు కోసం దేశవ్యాప్తంగా ఉన్ విశ్వ విద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నానని తెలిపాడు. తన తల్లి పేరు మీద స్కాలర్ సిప్ ఇస్తానని హామీ ఇచ్చారు. 

సోనూ సూద్ తల్లి సరోజ్ సూద్ పంజాబ్ లో పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పేవారని, తనను కూడా విద్యార్థులకు సాయం చేయాలని కోరేవారని పేర్కొన్నారు. ‘నువ్వు చూపిన మార్గంలోనే నేను వెళ్తున్నా అమ్మా. గమ్యం చాలా దూరంలో ఉంది. కానీ కచ్చితంగా దాన్ని చేరుకుంటాను’ అనే ఆవేదన వ్యక్తం చేశారు. 

Leave a Comment