బిగ్ బాస్ ఎలిమినేషన్ లిస్టులో గంగవ్వ..!

బిగ్ బాస్ -4 కు సంబంధించి తొలివారం పూర్తియింది. దీంతో కంటెస్టెంట్ల ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక తొలివారం ఎలిమినేషన్ లిస్టులో సూర్యకిరణ్, అభిజిత్, సుజాత, మెహబూబ్, దివి, అఖిల్ సార్థక్ మరియు గంగవ్వ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎలిమినేషన్ కు నామినేట్ అయిన కంటెస్టంట్లకు బిగ్ బాస్ కొన్ని టాస్కులు నిర్వహిస్తారు. అందులో విజేతలుగా నిలిచిన వారు సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించే అవకాశం ఉంది. 

ఇక మిగిలిన వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. నామినేషన్ లో ఉన్న వారిలో ఎవరు సేవ్ అవుతారనేది శనివారం తెలుస్తుంది. ఇదిలా ఉంటే..బిగ్ బాస్ హౌస్ లోకి మరో ఇద్దరు కంటెస్టంట్లు ఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వారు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశిస్తారు. వారిలో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, ఈ రోజుల్లో సినిమా ఫేమ్ సాయికుమార్, జంప్ జిలాని సినిమా హీరియిన్ స్వాతి దీక్షిత్ పేర్లు వినిపిస్తున్నాయి. 

Leave a Comment