సామాన్యులకు మరో షాక్.. భారీగా వంట గ్యాస్ సిలిండర్ ధర..!

చమురు కంపెనీలు సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చాయి. 14 కేజీల ఎల్పీజీ  గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1052కి చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో సామాన్యుడి నెత్తిపై వంట గ్యాస్ సిలిండర్ బాదుడు రూపంలో మరో భారం మోపినట్లయింది. 

ఈ ఏడాది మార్చి 22న చమురు కంపెనీలు సిలిండర్ ధరను రూ.50 మేర పెంచాయి. దాదాపు నెలన్నర రోజుల తర్వాత మరోసారి ధరలను పెంచాయి. ఇదిలా ఉంటే.. ఈనెల ప్రారంభంలో కమర్షియల్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు భారీగా పెంచిన సంగతి తెలిసిందే.. ఏకంగా రూ.102 మేర పెంచాయి.   

Leave a Comment