ఈరోజుల్లో చాలా మందికి వేధిస్తున్న సమస్య అధిక బరువు.. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవిన విధానం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెరిగిన ఈ బరువును తగ్గించుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే కొంత మందికి మాత్రం వ్యాయామం చేయడానికి కూడా టైం దొరకడం లేేదు.
అలాంటి వారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఇంటి చిట్కాను పాటించి బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ చిట్కాను పాటించడం వల్ల కేేవలం నెల రోజుల్లో మీ పొట్టలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. మరీ ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం..
బెల్లీ ఫ్యాట్ తగ్గించే చిట్కా..
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంతేకాదు బరువు తగ్గించే చిట్కాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటిలో ఒకటి వాము.. ప్రతి ఇంటి కిచెన్ లో వాము ఉంటుంది. వాము నీటితో బెల్లీ ఫ్యాట్ ని సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలంటే..
- వామును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం నిద్ర లేచిన తర్వాత తాగాలి. దీని వల్ల నడుము చుట్టు ఏర్పడిన కొవ్వు తగ్గుతుంది. వాము నీరు థైమాల్ కొవ్వును తగ్గించంలోనూ సహాయపడుతుంది.
- వాము తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. వాము నీటిని ప్రతిరోజు తాగడం వల్ల పొట్టలో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
- వాము నీటిలో అయోడిన్, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.