ఏపీలో వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు..!

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మీటర్ల ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మెరుగైన విద్యుత్ ని ఇవ్వగలుగుతామని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ మీటర్లను అమర్చే పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో విద్యుత్ మీటర్లను అమర్చేందుకు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. 

శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ మీటర్లు అమర్చడంతో దాదాపు 30 శాతం విద్యుత్ ఆదా అయిందని, కనెక్షన్లు పెరిగినప్పటికీ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటి వరకు రైతులు వాడని విద్యుత్ ను సైతం ఉచిత విద్యుత్ పేరుతో లెక్కగడుతున్నామని, మీటర్ల బిగింపుతో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందటంతో పాటు విద్యుత్ సిబ్బందిలోనూ జవాబుదారీతనం పెరిగిందని చెప్పారు. 

ఈ తతంగం ఎందుకు?

విద్యుత్ మీటర్ల బిగించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఉచిత విద్యుత్ కు మంగళం పాడేందుకే వ్యవసాయ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. రైతులు బిల్లులు చెల్లించాక, తదుపతి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు. అసలు మాటర్లు బిగించటం, బిల్లులు తీయటం, రైతులకు తిరిగి ఖాతాల్లో జమ చేయడం వంటి తతంగం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు జగన్ సర్కార్ మోకరిల్లుతోందని విమర్శలు చేస్తున్నారు. 

Leave a Comment