మీ ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయుందా..కొలెస్ట్రాల్ ను తగ్గించుకోండిలా

చాలా మంది రకరకాల ఆహారాలు తీసుకుంటూ స్థూలకాయులుగా తయారైపోతుంటారు. ఇంకొందరైతే అధిక బరువుతో బాధపడుతూ సతమతమైపోతుంటారు. కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కొలెస్ట్రాల్ అనేది ఒక కొవ్వు పదార్ధము. ఈ పదార్థం ఎక్కువగా రక్తం, శరీర కణాలలో ఉండి కణాలు, కణజాలాలు, అవయవాల తయారీకి ఇది చాలా అవసరం అవుతుంటుంది. కొలెస్ట్రాల్ హార్మోన్లు, విటమిన్-డి ఇంకా పిత్తాల ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. అందులో ఒకటి మంచి కొలెస్ట్రాల్, ఇంకోటి చెడ్డ కొలెస్ట్రాల్, గ్లిసరైడ్‌లు అనేవి ఉంటాయి.

మన శరీరంలో చెడుగా ఉండే కొలెస్ట్రాల్ స్థాయి పెరగడంతో, ధమనులలో కొవ్వు పేరుకుపోవడం ఎక్కువవుతుంది. ఇది గుండెకు చేరేటటువంటి రక్త ప్రవాహాన్ని అడ్డుకునేలా చేస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో తగిన జాగ్రత్తలు తీసుకుని సరైన పానీయాలను సేవించడం ఎంతో ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు కోలెస్ట్రాల్ ను నియంత్రించే కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం.

టమోటాలో లైకోపీన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ గా ఉంటుంది. ఇది కణాల నష్టాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా, నియాసిన్, కొలెస్ట్రాల్-తగ్గించే ఫైబర్ వంటివి టమోటాలలో ఎక్కువగా ఉంటాయి. రెండు నెలల పాటు రోజూ కనీసం 260 మిల్లీ లీటర్ల టమోటా రసం తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కోకోలో ఫ్లేవనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉంటుంది. అది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్‌లో కోకో ప్రధాన పదార్ధంగా ఉంటుంది.

అందులో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడేలా చేసే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. మామూలుగా 450 మిల్లీ గ్రాముల కోకోను రోజుకు రెండుసార్లు తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలనేవి నియంత్రించవచ్చు. అయితే ప్రాసెస్ చేయబడిన చాక్లెట్ లో అధిక స్థాయిలో సంతృప్త కొవ్వు ఉంటుంది కాబట్టి దానిని తినకపోవడమే మంచిది. యాంటీ ఆక్సిడెంట్లకు గ్రీన్ టీ నెలవు అనే చెప్పాలి. గ్రీన్ టీలో కాటెచిన్స్, ఎపిగలోకాటెచిన్ గ్యాలెట్‌ వంటివి ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో గ్రీన్ టీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

సోయా పాలలో తక్కువ స్థాయి సంతృప్త కొవ్వు పదార్థాలు అనేవి ఉంటాయి. సాధారణంగా పాలకు బదులుగా సోయా పాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే అవకాశం ఉంటుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ప్రకారంగా చూస్తే సంతృప్త కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం, రోజుకు 25 గ్రాముల సోయా ప్రోటీన్ సిఫార్సు చేయబడిందని చెప్పొచ్చు.

రోజూ తక్కువగా తాగడం వల్ల రక్తంలో హెచ్‌డిఎల్ స్థాయిలు పెరుగుతాయని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రెడ్ వైన్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. రెడ్ వైన్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో అది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా రెడ్ వైన్‌ను మితంగా తీసుకుంటే గుండె జబ్బులను నివారించవచ్చు. ఆల్కాహాల్ ను అధికంగా తాగడం వల్ల శరీరంపై వ్యతిరేక ప్రభావం అనేది ఎక్కువగా ఉండటంతో అది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేలా చేస్తుంది. అందుకే ఎక్కువగా తాగకుండా తక్కువగా తాగడం మంచిది.

Leave a Comment