యాంకర్ సుమకు అరుదైన వ్యాధి.. తన అనారోగ్య సమస్యను బయటపెట్టిన సుమ..!

యాంకర్ సుమ కనకాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ షోలలో, ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్ ఇలా ఏ ఈవెంట్ చూసినా ఆవిడే కనిపిస్తారు. గత 15 ఏళ్లుగా బుల్లితెరపై దూసుకుపోతోంది… కేరళ నుంచి వచ్చినా.. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తాజాగా సుమ ఓ యూట్యూబ్ ఛానెల్ లో అభిమానులతో ఎన్నో విషయాలు పంచుకుంది. మరీ ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా తాను బాధపడుతున్న ఒక వ్యాధి గురించి చెప్పుకుంది. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.  

సుమ చాలా రోజులుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. ‘కీలాయిడ్ టెండెన్సీ’ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు పేర్కొంది. తనకు ఏదైన గాయమైతే అది అవ్వాల్సిన దాని కన్నా ఎక్కవగా హీల్ అవుందని, దాని వల్ల తన ఒంటిపై గాయం మానినా ఆ మచ్చలు అలాగే కనిపిస్తుంటాయని చెప్పింది. 

ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేశానని, కానీ ఫలితం లేకుండా పోయిందని తెలిపింది. ఇంత కాలం ఈ వ్యాధి గురించి దాచి పెట్టానని, ఇంక దాచి పెట్టాలని అనుకోవట్లేదని సుమ చెప్పింది. ఎవరైనా తమలో ఉండే లోపాలను అందరి నుంచి దాచిపెట్టకుండా చెబితే మనలో భయం.. ఆత్మన్యూనతా భావం పోతాయని పేర్కొంది.  

Leave a Comment