లోబీపీ లక్షణాలివే.. ఇలా ఉంటే జాగ్రత్తలు తీసుకోండిలా..!

అధిక రక్తపోటు లేదా అల్ప రక్తపోటును కల్గి ఉండడం అన్నది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. అల్ప రక్తపోటును వాడుక భాషలో లోబీపీ అని అంటారు. హృదయం సంకోచించినపుడు మరియు హృదయ స్ఫురణం సమయంలో రక్తనాళాల గోడలపై ఒత్తిడి కల్గిస్తుంది. దీనిని రక్తపోటు అంటారు. బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ రెండు అంకెలను  ఉపయోగించి చెపుతారు. ఆరోగ్యవంతమైన వారి సాధారణ బీపీ 120/80 గా ఉంటుంది. బయటి దేశంలో ముఖ్యముగా అమెరికా లాంటి దేశంలో 6 నెలల్లో ఒక్కసారైనా డాక్టర్ దగ్గరకు వెళ్తారు.కాని మన దేశంలో డాక్టర్ దగ్గరకు వెళ్తే, ఏ రోగం ఉందంటారో, ఎంత బిల్లు అవుతుందో అనే భయముతో చాలా మంది పేదవారు వైద్యం చేపించుకోవడానికి వైద్యుడు దగ్గరికి వెళ్లరు. 

ఫలితంగా వారికి వచ్చే కొన్ని రకాల అనారోగ్యాల్ని ప్రారంభంలో గుర్తించలేము,తీరా అవి ముదిరిపోయాక ఆస్పత్రికి వెళ్ళిన ఉపయోగం ఉండదు.హైబీపీ లేదా లోబీపీ  ఈ రెండూ ప్రమాదకరమైనవే. వీటిని కంట్రోల్‌ల ఉంచుకోకపోతే. ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. మరి లోబీపీ ఉందో లేదో ఎలా గుర్తించాలి ఉంటే అందుకు కారణం ఏమై ఉంటుంది. తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ వయసు, ఆడ, మగ ఇలాంటి విషయాల మీద  ఆధారపడి ఉంటుంది.డాక్టర్లు  ప్రకారం డయాస్టోలిక్ ప్రెషర్  95 mmHg దాటకూడదు. అలాగే సిస్టోలిక్ ప్రెషర్ 140 mmHg మించకూడదు. ఇవి రెండూ చాలా తక్కువగా ఉంటే అది లోబీపీ అన్నమాటే. ఈ విలువ ఆడవారులో 60/100 కంటే తక్కువగా ఉంటే మరియు మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉంటే  దానిని లాబీపీ అని నిపుణులు అంటున్నారు.మనలో లోబీపీ ఉంది అని తెలుసుకోవడానికి ఈ క్రింది లక్షణలు ఉపయోగ పడుతుంది. 

ఓ కుర్చీలో ఆకస్మాత్తుగా పైకి లేసినప్పుడు  డిమ్ముగా,మసకగా ఉంటుంది. అంతే కాకుండా కళ్లు మసకగా కనిపిస్తూ ఉంటాయి. చూసే టప్పుడు అక్కడక్కడా చీకటి లాంటి చుక్కలు కనిపిస్తు ఉంటాయి.అలసట బాగా ఎక్కువగా ఉంటుంది. ఏ పనీ కూడా ఎక్కువ సేపు చెయ్యలేరు.తేలికపాటి తలనొప్పి ఉంటుంది.వికారంగా అనిపస్తుంది.మూర్ఛ కూడా వస్తుంది. మగవారిలో లోబీపీ సమస్యతో పోలిస్తే ఆడవారులో ఈ సమస్య అధికముగా ఉంటుంది.స్త్రీలలో గర్భము సమయంలో ఎక్కువ రక్తస్రావం అయితే.అది లోబీపీకి దారి తియ్యవచ్చు. కొన్ని రకాల మందులు సైడ్ ఎఫెక్టులు ఇస్తాయి. అవి లోబీపీ వచ్చేలా చేస్తాయి. 

మొత్తంగా లోబీపీ ఉందంటే బాడీలో సరిపడా రక్తం లేదని అర్థం. అందువల్ల లోబీపీ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లడం మంచిది. లోలోపల రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. అల్ప రక్తపోటు దీర్ఘకాలికంగా కొనసాగుతూ బాధిస్తున్నట్లైతే, జీవనశైలిలోను  మరియు ఆహారసేవనంలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా ఈ లో బీపీ సమస్యను అధిగమించవచ్చు. లోబీపీ ఎందుకు వచ్చింది అనే దాన్ని బట్టీ.ట్రీట్‌మెంట్ ఉంటుంది. కొన్ని సార్లు కారణాలు తెలియవు. బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉన్నవారు పైకి లేచేటప్పుడు నెమ్మదిగా లేవాలి. కళ్లు మసకగా ఉంటే,కాస్త ఎక్కువసేపు కూర్చోవాలి. నీరు సరిపడా తాగాలి.

 

Leave a Comment