మెగాస్టార్ చిరంజీవి ఫిటినెస్ సీక్రెట్స్..మీరూ పాటించేయండిలా..!

చిరంజీవి..ఈ పేరు తెలియని తెలుగు సినిమా అభిమానులు ఉండరు. చిరంజీవి గారి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఈయనని అందరు మెగాస్టార్‌గా పిలుస్తారు.ఈ బిరుదుతోనే ప్రేక్షకుల మనసు నిండిపోయింది.చిరంజీవి గారు 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు.చిరంజీవి గారి సినిమా ప్రయాణము 1978లో వచ్చిన పునాదిరాళ్ళు చిత్రంతో   ప్రారంభమైంది. కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు విడుదలైంది ఎంతో గొప్ప విజయము సాధిచింది.

చిరంజీవి గారు వయసు అవుతున్న కూడా మొదటి సినిమా నుంచి ఇప్పటి సినిమా వరకు ఆరోగ్యముగా ఫిట్ గా వున్నారు. దీనికి కారణము మెగాస్టార్ చిరంజీవి గారు బరువు తగ్గడానికి పాటించే డైట్.ఈయిన తన డైట్ నియంత్రణలో తాను సులభంగా అలవాట్లను మార్చుకోగలనని ఇంటర్వ్యూ లో చెప్పారు. అందుకే ఇప్పటికీ తన సినిమా పాత్రలకు తగ్గట్టుగా తనను తను మార్చుకోగలుగుతున్నాను అని చెప్పారు. దీనికి ఈ మధ్య కాలములో చిరంజీవి గారు నటించిన సైరా నరసింహ్మ రెడ్డి ఒక మంచి ఉదాహరణ. 

తెలుగు సినిమా పరిశ్రమలో  66 ఏళ్ల వయస్సు మీద పడిన కూడా  సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు మన మెగాస్టార్. అయితే, ఈరోజు  ఆయన ఇంత ఆనందముగా, ఎనర్జిటిక్గా, ఆక్టివ్ గాను ఉండటానికి, యంగ్ హీరోలతో పోటీపడడానికి ఫాలో అవుతున్న ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. దీంతో ఆయన ఫ్యాన్స్ లేదా ఫాలోయర్స్ కూడా  ఫిట్ గా కనిపించడానికి  ప్రయత్నించవచ్చు. మెగాస్టార్ చిరంజీవిగారి అభిప్రాయం ప్రకారము ఫిట్ గా ఉండడము అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కటే కాదు. మానసికంగా దృఢంగా ఉండాలి.అందుకే తానేప్పుడు  మానసికంగా కూడా స్ట్రాంగ్ అవ్వడానికి కొన్ని టిప్స్ పాటిస్తానన్నారు. 

ఒక సాధారణ ఇంటర్వ్యూలో చిరంజీవిగారు మానసికంగా కూల్ గా ఉండటానికి ఇష్టపడతానన్నారు. ఇది మానసికంగానే కాదు, శారీరక రూపానికి కూడా చాలా వరకు ప్రభావితం చూపతుంది అని అన్నారు. చిరంజీవి గారు ఉంటే బీజీ షెడ్యూల్, యాక్షన్ సీక్వెన్స్ వంటివి చేస్తూ కూడా అయినా ఆనందముగా ఉండటానికి   తనకున్న కాన్ఫిడెన్స్ ఎంతో  ఉపయోగ పడుతుంది అని అన్నారు. ఇంతటి తన గొప్ప  ఆత్మవిశ్వాసం ముందు తన వయస్సును ఎప్పుడూ ఆయనకు కనిపించ లేదు అన్నారు.

మెగాస్టార్ గారు ఎక్కువగా శాకాహర ఆహారము మాత్రమే తీసుకుంటారట. ఎక్కవ శాతం ప్రోటీన్ ఫుడ్ అయిన సలాడ్స్, సూప్స్ కే ప్రాధాన్యత ఇస్తారు అని ఆ ఇంటర్వ్యూ లో చెప్పారు. మరి అతి ముఖ్యంగా ఇంటి భోజనాన్ని తింటారు అని ఇంటర్వ్యూలో చెప్పారు. కొత్త పాత్ర కోసం అవకాశము వచ్చినప్పటి నుంచి మన మెగాస్టార్ గారు తన శక్తిని పెంచుకోవడానికి పాత్రకు తగ్గట్టుగా మారడానికి  ఎప్పుడు జిమ్ చేస్తూనే ఉంటారు.

 

Leave a Comment