ఏపీలో కొత్తగా 26 జిల్లాలు..నేడో రేపో నోటిఫికేషన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. రాష్ట్రంలో 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేయనుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటుకానున్నాయి.

మొదట ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా చేయాలనుకుంది. అయితే అరకు లోక్ సభ నియోజకవర్గం భౌగోళికంగా సుదీర్ఘంగా విస్తరించి ఉంది. దీంతో అరకు లోక్ సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా చేయనున్నారు. అంటే కొత్తగా రెండు గిరిజన జిల్లాలు ఏర్పడనున్నాయి.  

కొత్తగా ఏర్పడనున్న జిల్లాలు:

అరకు(2 జిల్లాలు), అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, హిందూపురం, రాజంపేట, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం.

 

 

Leave a Comment