ట్రాన్స్ జెండర్ తో ప్రేమ వివాహం.. కట్నం కోసం వేధింపులు..!

ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వరకట్న వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. వివరాల మేరకు ఏలూరు సత్రంపాడుకు చెందిన తారక అలియాస్ పండు అనే యువకుడికి హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన ట్రాన్స్ జెండర్ భూమితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. 

ఆ ఫేస్ బుక్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ట్రాన్స్ జెండర్ అని తెలిసికూడా ప్రేమాయణం సాగించాడు. అనంతరం 2020 జనవరిలో పెద్దలను ఒప్పించి మరీ భూమిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా కొనసాగుతుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది.

అప్పటి నుంచి నువ్వు నాకు వద్దు అంటూ ఆమెతో గొడవపడటం ప్రారంభించాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో భూమితో ఉండేందుకు నిరాకరించాడు. దీంతో పాటు అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేశాడు. దీంతో భూమి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని తారకను అరెస్టు చేశారు. 

   

 

You might also like
Leave A Reply

Your email address will not be published.