ఒళ్లంతా రామనామంతో పచ్చబొట్లు..!

రామ-నామి అనే తెగ తమ ఒళ్లంతా రామనామంతో పచ్చబొట్లు వేసుకుంటారు. ఛత్తీస్ గఢ్ లోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఈ తెగ కనిపిస్తుంది. ఇది గిరిజన తెగల్లో అట్టడుగు వర్గాలకు చెందిన తెగ. ఈ తెగకు చెందిన వారు తమ శరీరంలోని ప్రతి భాగంలోనూ రాముడి పేరును పచ్చబోట్లు పొడిపించుకుంటారు. 

పూర్వం ఈ తెగవారిని రాముని ఆలయాల్లో రానిచ్చేవారు కాదు. దీంతో దేవుడు ఆలయాల్లోనే కాదు, తమలోనూ ఉన్నాడనీ, తమ దేహామే రామ మందిరమని భావించి శరీరం మీద రామనామాన్ని పచ్చబొట్లుగా పొడిపించుకోవడం ప్రారంభించారు. దీంతో వీరిని రామ-నామిలు అని పిలుస్తారు. 

తర్వాతి కాలంలో వీరికి ఆలయ ప్రవేశం కల్పించినా, పచ్చబొట్ల ఆచారం మాత్రం కొనసాగుతోంది. వీరు ఎల్లప్పుడూ రామనామం జరిస్తూ ఉంటారు. అయితే వీరిలో కొందరు కనురెప్పలతో సహా శరీరమంతా పచ్చబొట్లు వేయించుకుంటారు. వీరిని ‘నఖ్ శిఖ్’ అని, మరికొందరు కేవలం నుదుటిపై మాత్రమే పచ్చబొట్టు పొడిపించుకుంటారు. వీరిని ‘శిరోమణి’ అని పిలుస్తారు. 

ఈ తెగలోని వారు మాంసాహారం, ధూమపానం, మద్యపానం సేవించకుండా నియమనిష్టలతో రాముడిని పూజిస్తుంటారు. తమ పనులు, ఇళ్లలో శుభకార్యాలు జరిగినా శ్రీరామనామంతోనే ప్రారంభిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. వీరి ఒంటిపైనే కాకుండా వస్త్రాలను, నెమలి ఈకలతో చేసిన శరిస్త్రానంపై కూడా శ్రీరామ నామమే ఉంటుంది. 

 

Leave a Comment