ఏపీకి ‘హోదా’ ఇవ్వండి.. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్..!

విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందని, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. 

ఏపీలో కనీసం టయర్-1 నగరం కూడా లేదన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు, పారిశ్రామికంగా వేగంగా ఎదగడం వంటివి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంట్ లో ప్రకటించినట్లు గుర్త చేశారు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.