భూఆక్రమణ కేసులో.. విచారణకు హాజరైన మహాశివుడు..!

భూఆక్రమణ విషయంలో మహా శివుడు విచారణకు హాజరుకావాలని ఇటీవల కోర్టు నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్ గడ్ రాష్ట్రం రాయ్ గఢ్ లోని వార్డు నంబర్-25లో శివాలయంతో సహా మొత్తం 16 మంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. 

కోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం 10 మందికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల్లో శివాలయం పేరు కూడా ఉంది.. ఈనెల 25న విచారణకు రావాలని, లేకపోతే రూ.10 వేలు జరిమానా కట్టాలని హెచ్చరించారు. దీంతో నోటీసులు ఇచ్చిన వారందరూ విచారణకు హాజరయ్యారు.. 

శుక్రవారం జరిగిన విచారణకు మహాశివుడితో పాటు నోటీసులు అందుకున్న మరో 9 మంది విచారణకు వచ్చారు.. మహాశివుడు ఎలా వస్తాడని అనుకుంటున్నారా.. విచారణకు వచ్చే వారు తమతో పాటు గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చారు. ఆ మహాశివుడు విచారణకు హాజరుకాలేడు. కాబట్టి.. గుడిలోని శివలింగాన్నే రిక్షాపై తీసుకొచ్చారు.. 

Leave a Comment