విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం..!

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రేల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రత్యేక జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. 

రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రైల్వే జోన్ పై అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు డీపీఆర్ సమర్పించాక కొత్త రైల్వే జోన్, రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటుు పరిధి, ఇతర అంశాలు తమ దృష్టికి వచ్చాయని మంత్రి తెలిపారు. ఈ అంశాలను పరిశీలించేందుకు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 

కొత్త రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం నిర్మానానికి భూమిని ఎంపిక చేశామన్నారు. పరిపాలన, నిర్వహణ అవసరాలతో పాటు ఇతరాత్ర హేతుబద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపనట్లు రైల్వే మంత్రి తెలిపారు. 

 

Leave a Comment