శ్రీలంకలో ఆకలి కేకలు.. కిలో బియ్యం రూ.500, కప్ టీ రూ.100..!

శ్రీలంకలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఎంతలా అంటే అక్కడ కిలో బియ్యం రూ.500, కిలో చక్కెర 290, 400 గ్రాముల పాలపొడి రూ.790, కప్ టీ రూ.100, 12.5 కిలోల వంట గ్యాస్ రూ.4119 పెరిగిపోయాయి. రోజురోజు పెరుగుతున్న నిత్యావసర ధరలతో లంకేయులు గగ్గోలు పెడుతున్నారు. నిత్యావసరాలు కొనలేక ఆకలితో పస్తులుంటున్నారు.. 1948 తర్వాత శ్రీలంకలో ఇంతటి దయనీయ పరిస్థితి రావడం మొదటిసారి.. 

కారణాలేంటీ?

డ్రాగన్ నుంచి తీసుకున్న భారీ అప్పుల కారణంగానే శ్రీలంక దివాళా తీయడానికి దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.   శ్రీలంక ప్రతిదీ విదేశీ దిగుమతులపైనే ఆధారపడింది. ఆయిల్, ఆహారం, కాగితం, పప్పులు, ఔషధాలు ఇలా అన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే.. నిత్యావసరాలు దిగుమతి చేసుకోవడానికి మార్చి నాటికి కేవలం 2.36 బిలియన్ డాలర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. విద్యార్థుల పరీక్షల నిర్వహణకు అవసరమైన పేపర్, ఇంక్ కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. 

శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.254, లీటర్ డీజిల్ ధర రూ.176కి చేరింది. పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూలైన్లు కనబడుతున్నాయి. ఇక శ్రీలంకలో ఇప్పటికీ 20 శాతం కుటుంబాలు కిరోసిన్ స్టవ్ లపైనే వంట చేసుకుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరోసిన్ అందుబాటులో లేక చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలు, నిత్యావసరాలు భారీగా పెరిగిపోవడంతో లంకేయులు ఆకలి కేకలు వేస్తున్నారు.. 

 

Leave a Comment