మరో వినాశనం తప్పదా?

రాష్ట్రానికి మరో గండం పొంచి ఉందా? ఇప్పటికే కరోనా మహ్మారితో పోరాడుతున్న రాష్ట్రం మరో విపత్తుతో పోరాడాలా? ఈ సారి ముంచుకొస్తున్న గండం ప్రజల మీదికి కాదు..పొలాల మీదికి..ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పంటలను నాశనం చేస్తున్న మిడతల దండు ఇప్పుడు రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. ఈ మిడతల దండు ఒకవేళ రాష్ట్రంలో ప్రవేశిస్తే ఇక పంట పొలాలన్నీ నాశనం చేస్తాయి. 

మన పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ మిడతల దండు భారత్ లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై వీటి ప్రభావం విపరీతంగా ఉంది. 

ఈ మిడతలకు పంట ఏదనేది సంబంధం లేదు. పచ్చగా ఏది కనిపిస్తే దాన్ని శుభ్రంగా ఆరగించేస్తాయి. మిడతల దండు పొలంలో పడిందంటే ఇక ఆ పొలంలో ఏది మిగలదు. కొన్ని గంటల్లోనే అక్కడ పంట ఉన్నదన్న సంగతి తెలియకుండా సర్వనాశనం చేస్తాయి. మరి అలాంటి మిడతల గురించి ఆసక్తికర విషయాలు.  

  • ఈ మిడతలు మన పరిసరాల్లో ఉండే మిడతల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే మన ఇంటి వద్ద ఒకటి రెండు ఉంటే..అక్కడ మాత్రం వేలు, లక్షల్లో ఉంటాయి.  
  • ఈ మిడతలు కిలోమీటర్ పరిధి గల ప్రాంతాన్ని 80 మిలియన్ల మిడతలు ఆక్రమించగలవు. ఇవి 35 వేల మందికి సరిపోయే ఆహారాన్ని ఒక్క రోజులో తినేస్తాయి. 
  • ఎడారి మిడతల జీవిత కాలం 90 రోజులు. ఈ కాలంలో అవి రెండు గుడ్లు పెడతాయి. ఆరు వారాల్లో అవి పెరిగి పెద్దవి అవుతాయి. 
  • వర్షాకాలంలో వీటి సంతానోత్పత్తి గణనీయంగా ఉంటుంది. మూడు నెలల్లో ఇవి 20 రెట్లు పెరుగుతాయి. 
  • ఈ మిడతలు తూర్పు ఆఫ్రికా, సూడాన్ నుంచి మొదలై సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్ కు వచ్చాయి. పాక్ నుంచి ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించాయి. 
  • సాధారణంగా ఏటా జులై నుంచి అక్టోబర్ మధ్య వీటి ప్రయాణం ప్రారంభమవుతుంది. వేగవంతమైన గాలులతో నిత్యం 150 కిలోమీటర్ల దూరం నిరవధికంగా ఎగురుతాయి. 

నివారణ చర్యలు..

ప్రస్తుత వాతావరణాన్ని బట్టి ముందస్తు జాగ్రత్త అవసరమని ఒడిశా యూనివర్సీటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ(ఓయూఏటీ) తెలిపింది. నివారణ చర్యల కోసం కొన్ని సూచనలు చూసింది. 

  • 5 శాతం వేప గింజల గుజ్జుతో 200 లీటర్ల ద్రవ విశ్రమం పిచకారీ చేయడం ప్రాథమిక నివారణ చర్య. 
  • ఒక ఎకరం విస్తీర్ణంలో 1 లీటరు వేప గింజల గుజ్జు – 300 పీపీఎస్ 200 లీటర్ల నీటిలో కలిపి మధ్యాహ్నం పిచికారీ చేయాలి. 
  • 200 లీటర్ల నీటిలో 400 మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫాస్ 50 ఈసీ కలిపిన మిశ్రమాన్ని పిచాకారీ చేయాలి. 
  • డబ్బాలు, పాత్రలు వాయించి చప్పుడు చేయడం మిడతల దాడి నివారణకు మరో ఉపాయం.
  • ముళ్ల కంచెతో రువ్వుతూ మిడతల సమూహాన్ని పారదోలాలి.
  • చెట్లకు చుట్టుముట్టిన మిడతల సమూహం తొలగింపునకు చెట్ల కింద పాలిథీన్ షీటు పరిచి కొమ్మల్ని ఊపడంతో నేల రాలతాయి. వీటిని కిరసనాయిలు మిశ్రమ నీటిలో పోసి దూరంగా పారబోయాలి. 

Leave a Comment