విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక వెబ్‌సైట్‌

విద్యా రంగంలో కార్పొరేట్ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ సమూల మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా విద్యా సంస్థ మానిటరింగ్ కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. www.apserms.ap.gov.in పేరిట ప్రారంభమైన ఈ వెబ్ సైట్ లో స్కూళ్లు, కాలేజీలు తమ దగ్గరున్న వసతులు, వారు పాటిస్తున్న ప్రమాణాల వివరాలను అప్ లోడ్ చేయాలి. 

ఈ డొమైన్  అందరికీ అందుబాటులో ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలు వెబ్‌సైట్‌లో ప్రకటించిన వివరాల్లో నిజంగా లేకపోతే, విజిల్‌ బ్లోయర్స్‌ ఎవరైనా స్పందించి సమాచారం ఇవ్వొచ్చు. విద్యా రంగంలో కార్పొరేట్‌ సంస్కృతికి చెక్‌ పెట్టేందుకు రెండు కమిషన్లు ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా ఇద్దరు హైకోర్టు జడ్జీలు జస్టిస్‌ ఆర్‌.కాంతారావు, జస్టిస్‌ ఈశ్వరయ్యకు బాధ్యత అప్పగించారు. ఒకరు పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు, మరొకరు ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు బాధ్యత వహిస్తారు. ఇప్పటికే ఆ కమిషన్లు పనులు మొదలు పెట్టాయని తెలిపారు.

Leave a Comment