మళ్లీ కరోనా కలకలం.. దేశంలో అక్కడ మళ్లీ లాక్ డౌన్..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఎంతో బీభత్సం సృష్టించిందో తెలిసిందే..ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుమఖం పట్టాయి. దీంతో కరోనా తగ్గిందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు.. అంతలోపే కరోనా మరోసారి కలకలం రేగింది. దేశంలో అక్కడక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

తాజాగా పశ్చిమ బెంగాల్ లో కరోనా తీవ్రత అధికమైంది. దీంతో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్ పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. మూడు రోజుల పాటు అన్నింటినీ మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సోనార్ పూర్ మున్సిపాలిటీ రాష్ట్ర రాజధాని కోల్ కతాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

 దుర్గాపూజ పండుల అనంతరం కరోనా కేసులు 25 శాతం పెరిగినట్లు ఐసీఎంఆర్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. వైరస్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరింది. కోల్ కతాలోనే 248 కేసులు నమోదుకాగా, ఆరుగురు చనిపోయారు. అయితే కొత్త కేసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారే ఎక్కువగా ఉన్నారని, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఆరు నెలల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 

Leave a Comment