లాక్ డౌన్ వార్తలు అవాస్తవం : పీఐబీ

దేశవ్యాప్తంగా మే 3 నుంచి పూర్తి లాక్ డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మే 3 నుంచి 20వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తారని ఓ వార్తా చానెల్ ప్రసారం చేసినట్లు, ఆ క్లిప్పులు వైరల్ అయ్యాయి. అయితే ఈ వదంతులను కేంద్రం కొట్టిపారేసింది. ఈమేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసి స్పష్టం చేసింది. 

లాక్ డౌన్ వార్తలు అవాస్తవమని, లాక్ డౌన్ విధిస్తారని కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదని పీఐబీ పేర్కొంది. లాక్ డౌన్ పై తాము ఎలాంటి వార్తలు ప్రసారం చేయలేదని సదరు న్యూస్ చానెల్ కూడా స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం లాక్ డౌన్ అవసరం లేదని, కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా పరిగణించాలని, మే 31 వరకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇటీవలే కేంద్ర హోంశాఖ సూచించింది.  

Leave a Comment