కొరటాల సినిమాలో స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్?

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ కొత్త ప్రాజెక్టులో ఎలా కనిపించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. విద్యార్థులు, రాజకీయాలు ఇతివృత్తంగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. 

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కన్పించనున్నాడని సమాచారం. రాజకీయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినకూడదనే ఉద్దేశ్యంతో బరిలో దిగిన హీరోకు ఎదురయ్యే పరిస్థితులు, వాటిని ఎలా అధిగమిస్తాడు.. ఆక్రమంలో విజయం సాధిస్తాడా లేదా అనేది ప్రధానంగా సినిమాలో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరనేది నిర్ణయం కాలేదు..

కాగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో, కొరటాల శివ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో 2016లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే…

Leave a Comment