లాక్ డౌన్ పొడిగింపు వైపే చాలా రాష్ట్రాలు మొగ్గు..

భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7వేలు దాటింది. 239 మరణాలు సంభవించాయి. దీంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు రెండు వారాల పాటు పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరాయి. లాక్ డౌన్ పొడిగింపు, కరోనా కేసుల పరిస్థితిపై ప్రధాని మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

లాక్ డౌన్ ముగియడం వల్ల కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున చాలా రాష్ట్రాలు పొడిగింపుకు మొగ్గు చూపాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని కోరగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాక్షిక లాక్ డౌన్ చేయాలని సూచించారు. అయితే తుది నిర్ణయం ప్రధాని మోడీదే. దీనిపై ఆయన త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది. 

 

Leave a Comment