మే 31 వరకు లాక్ డౌన్ 4.0..

మే 18 నుంచి నాలుగో లాక్ డౌన్ ప్రారంభం కానుంది. మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో ముఖ్యంగా ప్రజారవాణా పరంగా సడలింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత వారం నుంచి పరిమిత సంఖ్యలో ప్యాసింజర్ రైళ్లు నడుస్తుందున, ఇక మెట్రో సేవలతో సహా విమానయాన రంగం మరియు రోడ్డు రవాణాను కొంత సడలింపు లభిస్తుందని భావిస్తున్నారు. మే 31 వరకు మరో రెండు వారాల పాటు కొనసాగే ఈ లాక్ డౌన్ కు ఈ రోజు మార్గదర్శకాలు ప్రకటించనున్నారు. మరి కొద్ది సేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

  గత వారం జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ కొత్త నిబంధనలతో లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించారు. కరోనా తమతో చాలా కాలం ఉంటుందని, దాని జీవించడం నేర్చుకోవాలని సూచించారు. లాక్ డౌన్ పై బ్లూ ప్రింట్లను కూడా సమర్పించాలని ఆయన రాష్ట్రాల సీఎంలను కోరారు. 

నాలుగో దశ లాక్ డౌన్ లో సామాజిక దూరం యొక్క కఠినమైన నియమాలను లోబడి మెట్రో ప్రయాణాన్ని అనుమతించే అవకాశం ఉంది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప నిర్మాణ కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సరి-బేసి ప్రాతిపదికన షాపింగ్ మాల్స్ ను పాక్షికంగా తెరవడానికి ప్రభుత్వం అనుమతించే అవకాశాలు ఉన్నాయి. 

Leave a Comment