EMI లేకుండా SBI Emergency Loan  పొందడం ఎలా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సంక్షోభంలో ప్రధాన మంత్రి నరేంద్ మోడీ సెల్ఫ్ రిలయంట్ ఇండియా కోసం పిలుపునిచ్చారు. కోవిడ్-19 సంక్షోభాన్ని అధికమించేందుకు అనేక పథకాలు, ఆర్థిక సంస్కరణలు మరియు సహాయక చర్యలను ప్రకటించింది. 

అయితే చాలా కంపెనీలు ఉద్యోగుల వేతనాలను తగ్గించింది. కొన్న కంపెనీలు మూసివేయడం వల్ల చిన్న వ్యాపారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని SBI వారికి తక్కువ వడ్డీతో SBI Emergency Loan ను ప్రారంభించింది. ఈ రుణానికి ఆరు నెలలు వాయిదా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.

లాక్ డౌన్ లో మీకు డబ్బు అవసరం ఉంటే మరియు ఎలా, ఎక్కడ నుంచి అప్పు తీసుకోవాలో ఆందోళన చెందుతున్నారా? అయితే మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. దీని కోసం మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేేదు. ఇంట్లో కూర్చొనే కేవలం 45 నిమిషాల్లో SBI Emergency Loan పొందవచ్చు. 

SBI Emergency Loan కు వడ్డీ ఎంత?

SBI Emergency Loan సంవత్సరానికి 7.25 శాతం వడ్డీ రేటుతో లభిస్తుంది. ఇది వ్యక్తిగత రుణాపై సాధారణ వడ్డీ రేటు కంటే చాలా తక్కువ. ఇది సంవత్సరానికి 10.50 శాతం నుంచి ప్రారంభమవుతుంది. 

6 నెలల తర్వాతే EMI..

మీరు SBI Emergency Loan తీసుకున్న తర్వాత మొదటి నుంచి ఆరు నెలల వరకు EMI చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు మే నెలలో SBI Emergency Loan తీసుకుంటే అక్టోబర్ వరకు EMI చెల్లించాల్సిన అవసరం లేదు. మీ EMI ఆరు నెలల తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది.

 SBI Emergency Loan కు ఎవరు అర్హులు..

ఈ రుణం అందరికీ అందుబాటులో లేదు. వారి ఆదాయం మరియు వ్యయం అధారంగా బ్యాంక్ ఇప్పటికే ఆమోదించిన వినియోగదారులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. 

మీరు అర్హలా? కాదా ? అని ఎలా చెక్ చేసుకోవాలి..

మీరు రుణానికి అర్హులా కాదా అని చెక్ చేసుకోవానికి PAPL<space> మీ బ్యాంక్ ఖాతా యొక్క చివరి 4 అంకెలను టైప్ చేసి 567676 నంబర్ కు SMS చేయాలి. ఈ మెసేజ్ ను పంపిన తర్వాత మీరు ఈ రుణం పొందడానికి అర్హులా కాదా అనేది మీకు తిరిగి మెసేజ్ వస్తుంది.  

SBI Emergency Loan పొందడం ఎలా?

  • మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్ లో YONO SBI యాప్ ను డౌన్ లోడ్ చేయండి. 
  • ‘Pre Approved Loan’ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు సమయ వ్యవధి మరియు రుణ మొత్తాన్ని ఎంచుకోండి.
  • తర్వాత OTP ని ఎంటర్ చేయండి. అంటే మీకు కావాల్సిన మొత్తం మీ అకౌంట్ లో జమ అవుతుంది. 

Leave a Comment