లాక్ డౌన్-4 మార్గదర్శకాలు జారీ..

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మే 31 వరకు పొడిగించింది. లాక్ డౌన్-4 కు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే జోన్ల విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పింది. కంటైన్మెంట్ జోన్లలో అవసరమైన కార్యకలాపాలను మత్రమే అనుమతించాలని కేంద్రం స్పష్టం చేసింది.

బస్సులు, ఇతర వాహనాలను నడపడానికి అనుమతించింది. కానీ కిలకమైన బార్లు, విమాన ప్రయాణం మరియు మెట్రో రైళ్లు, మాల్స్, జిమ్ లు, సినిమా హల్లు మరియు పెద్ద సమావేశాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. 

లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు ఇవే..

  • మే 31 వరకూ విద్యాసంస్ధల మూసివేత 
  • రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగింపు
  • స్కూళ్లు, సినిమాహాల్స్‌, హోటల్స్‌కు నో పర్మిషన్
  • విమాన సర్వీసులకు అనుమతి లేదు
  • రాష్ట్రాల అనుమతులతో బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాలకు అనుమతి
  • రాష్ట్ర పరిధిలో బస్సు సర్వీసులు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణాలపై రాష్ట్రాలదే తుది నిర్ణయం
  • రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్వ్యూ నిబంధనలు అమలు
  • 65 ఏళ్లు దాటినవారు, గర్భిణి మహిళలు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇళ్లకే పరిమితం
  • కంటైన్‌మెంట్‌జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి
  • రెడ్‌, గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌ల గుర్తింపు జిల్లా అధికారులదే
  • కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కఠినతరం
  • క్రీడా సముదాయాలు మరియు స్టేడియంలకు అనుమతి. కానీ ప్రేక్షకులకు అనుమతి లేదు..

 

Leave a Comment