ఏపీ ప్రజలు తప్పక గుర్తు పెట్టుకోవాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే..

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ సీఎం జగన్ అహర్నిషలు శ్రమిస్తున్నారు. ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన పరిష్కరించేందుకు కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా కాల్ సెంటర్ కు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తారు. 

అత్యవసర సమయాల్లో కాల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హెల్ప్ లైన్  నెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. 

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టెలిమెడిసిన్ సేవలను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా వైద్య సూచనలు ఇవ్వడమే కాకుండా మందులు కూడా ఇంటికి డెలివరీ చేస్తారు. 

మహిళల రక్షణ కొసం సీఎం జగన్ దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. దిశ చట్టం కోసం టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా వ్యవసాయ సమస్యలను పరిష్కరించేందుకు, కరెంటు సమస్యలు పరిష్కరించేందుకు, అవినీతిని నిరోధించేందుకు ప్రత్యేక నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. 

ప్రతి ఒక్కరూ ఈ నంబర్లను తమ వద్ద ఉంచుకోవాలి. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నంబర్లను కచ్చితంగా గుర్త పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 

 ప్రతి ఒక్కరూ గుర్త పెట్టుకోవాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు..

 

పోలీస్100
అగ్నిమాపక కేంద్రం101
ఆరోగ్యం, వైద్యం104
టెలిమెడిసిన్14410
ఇసుక, మద్యం14500
వ్యవసాయం1907
కరెంటు సమస్యలు1912
ప్రభుత్వ అంబులెన్స్108
అవినీతి నిరోధం14400
దిశ100 /112/181
ప్రజా సమస్యలు1902

Leave a Comment