తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్..!

తెలంగాణలో బుధవారం నుంచి లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పది రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలు కానుంది.

ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించనున్నారు. అలాగే వ్యాక్సిన్ కొరత నివారించేందుకు టీకా కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. 

కాగా, గతంలో లాక్ డౌన్ పెట్టే ప్రసక్తి లేదని చెప్పిన కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు. అంతే కాదు సరిహద్దులో అంబులెన్స్ అడ్డుకోవడాన్ని కూడా హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక పాతబస్తీలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదన్న న్యాయస్థానం, లాక్ డౌన్ విధిస్తారా లేదా నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

 

Leave a Comment