డబుల్ మాస్క్ పై కేంద్రం గైడ్ లైన్స్..!

కరోనా కట్టడికి డబుల్ మాస్క్ ధరించాలని శాస్త్రవేత్తలు సూచించారు. డబుల్ మాస్క్ వేసుకోవడంతో కొంతమేరకు వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు. ఈనేపథ్యంలో డబుల్ మాస్క్ ధరించడంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 

మార్గదర్శకాలు..

  • ఒకే రకమైన రెండు మాస్క్ లను డబుల్ మాస్క్ గా వాడొద్దు..
  • డబుల్ మాస్క్ ధరించేటప్పుడు సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ కలిపి ధరించాలి..
  • ఒకే మాస్క్ ను వరుసగా రెండు రోజుల పాటు వాడొద్దు..
  • ముక్కు మీద బిగుతుగా ఉండేలా మాస్క్ ధరించాలి..
  • శ్వాస క్రియకు ఆటంకం కలిగించేలా మాస్క్ ఉండకూడదు..
  • క్లాత్ మాస్క్ ను తరుచూ ఉతుకుతూ ఉండాలి..

కరోనా వైరస్ ను సాధారణ మాస్క్ తో పోలిస్తే డబుల్ మాస్క్ రెండు రెట్లు సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఓ అధ్యయనం తెలిపింది. సాధారణ క్లాత్ మాస్క్ 42 నుంచి 46 శాతం వరకు రక్షన కల్పిస్తుందని, సర్జికల్ మాస్క్ అయితే 56.4 శాతం రక్షణ ఇస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్కుపై క్లాత్ మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.  

Leave a Comment