లాక్ డౌన్ ఎఫెక్ట్ : పంజాబ్ లో ఏఎస్సై చేయి నరికేసిన సిక్కులు

లాక్ డౌన్ ధిక్కరించారని అడ్డుకోవడంతో పోలీసులపై దాడి చేసిన ఘటన పంజాబ్ లోని పాటియాలా జిల్లాలోని కూరగాయల మార్కెట్ వద్ద  ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి చేతిని నరికి వేశారు దుండగులు. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. లాక్ డౌన్ అమలవుతున్న ప్రాంతంలో వారిని వివరాలు అడిగేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. 

పంజాబ్ పోలీస్ చీఫ్ దింకర్ గుప్తా మాట్లాడుతూ నిహాంగ్స్ సిక్కులకు చెందిన ఒక బృందం ఉదయం 6 గంటలకు కూరగాయల మార్కెట్ అంచున్న ఉన్న బారికేడ్లను దాటి వెళ్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని కర్ఫ్యూ పాస్ చూపించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో వారు పోలీసుల  బృందంపై దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో ఏఎస్సై హర్జిత్ సింగ్ చేతిని దుండగులు నరికివేశారు. మరి కొంత మంది గాయపడ్డారు. 

పారిపోయిన  నిహాంగ్స్ సిక్కులను బల్బెరా గ్రామంలోని గురుద్వార వద్ద ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గాయపడ్డ ఏఎస్సైకి చికిత్స అందిస్తున్నారు. 

Leave a Comment