ఏపీలో 405 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405 కు చేరింది. కొత్తగా 24 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసు పాజిటివ్ వచ్చాయి. 

ఇప్పటి వరకు ఏపీలో ఆరుగురు మరణించారు. కరోనా పాజిటివ్ నుంచి కోలుకుని 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రులలో ప్రస్తుతం 388 మందికి చికిత్స చేస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 82 కేసులు నమోదు కాగా, గుంటూరులో 75 కేసులు నమోదయ్యాయి. 

దేశంలో గత 24 గంటల్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు 7,529 కేసులు నమోదయ్యాయి. 242 మంది చనిపోయారు. అయితే అత్యధికంగా మహారాష్ట్రలో 1574 కేసులు, తమిళనాడులో 911, ఢిల్లీలో 903, రాజస్థాన్లో 553, తెలంగాణలో 504,  మధ్య ప్రదేశ్ లో 443, ఉత్తర ప్రదేశ్ లో 433, కేరళలో 364 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా మిజోరాంలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. 

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధాని మోడీని కోరాయి. లాక్ డౌన్ పొడిగించకపోతే పరిస్థితి అదుపులోకి రాదని పేర్కొన్నాయి. ఇప్పటికే చాలా పలు రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించాయి. 

Leave a Comment