ఆ హీరోతో లిప్ లాక్ ఇష్టం : తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు టాప్ హీరోయిన్స్ లలో ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించారు. అయితే గ్లామర్ షో విషయంలో ఎప్పుడూ వెనుకాడని తమన్నా.. లిప్ లాక్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాగా, సమంత హోస్ట్ గా ఆహాలో ‘సామ్ జామ్ షో’ ప్రసారమవుతుంది. 

ఈ షోకు మిల్కీ బ్యూటీ తమన్నా హాజరయ్యారు. ఈ షోలో తమన్నా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఈ షోకు సంబంధించి ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో తమన్నాకు సమంత కొన్ని చిలిపి ప్రశ్నలు వేశారు. ‘నో కిస్సింగ్ ఆన్ స్క్రీన్ రూల్ బ్రేక్ చేస్తే.. ఎవరితో కిస్ చేయడానికి ఇష్టపడతావు’ అని సమంత అడిగారు.

 దీనికి సమాధానంగా తమన్నా ‘ఐ లైక్ టు కిస్ విజయ్ దేవరకొండ’ అంటూ కొంటెగా సమాధానమచ్చింది. అంతే కాడు అఖిల్ మీ కంటే చిన్నవాడు కదా అని అడిగితే.. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని తమన్నా చెప్పింది. మీరు కోరుకుంటే నేను అఖిల్ నాన్నతో మాట్లాడి స్వయంగా మీటింగ్ ఏర్పాటు చేస్తానని సమంత తెలిపింది. 

Leave a Comment