ఐక్యతను చాటుదాం : ప్రధాని మోడీ

దేశమంతా కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోందని, ఇది భారత ప్రజల ఐక్యతను కొనయాడుతోందని ప్రధాని మోడీ ప్రశంసించారు. శుక్రవారం ఉదయం ఆయన దేశ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు.  దేశ ప్రజలందరూ లాక్ డౌన్ ను గౌరవించారని, చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లేనని చెప్పారు. భారతీయులందరూ ఏకమై కరోనాను తరమికొట్టాలని పిలుపునిచ్చారు. 

జనతా  కర్ఫ్యూ రోజున కరోనా పోరులో సేవలందిస్తున్న వారికి చప్పట్లతో దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలిపిన తీరు ప్రపంచాన్ని ఆకర్షించిందని అన్నారు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించాలని కోరారు. లాక్ డౌన్ కు దేశ ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారన్నారు. 

ఈ సారి ఆయన మనముందు మరో సందేశాన్ని తీసుకొచ్చారు. ఏప్రిల్ 5న 130 కోట్ల మంది తమ శక్తిని చూపాలన్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపేయాలన్నారు. కొవ్వొత్తులు, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయాలన్నారు. ఆ సమయంలో అందరూ సామాజిక దూరం పాటించాలన్నారు. ఆ దీపం వెలుగు మనకు స్ఫూర్తి నింపాలని, మనం ఒటరి కాదనే భావన కల్పించాలని చెప్పారు. 

Leave a Comment