దేశంలో 2,300 కరోనా పాజిటివ్ కేసులు..

దేశంలో కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 300కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశం మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2,301కి చేరింది. మరణాల సంఖ్య 56కి పెరిగాయి. 

భారతదేశంలో 2,088 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 156 మంది రోగులు ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. 

గత కొద్ది రోజులుగా ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు బాగా పెరిగిపోయాయి. గత నెలలో ఢిల్లీలోని నిజామొద్దీన్ మర్కస్ లో జరిగిన సదస్సు వల్ల కేసుల సంఖ్య చాలా వరకు పెరుగుతున్నాయి. ఢిల్లీ సదస్సుకు వెళ్లిన వారిని, వారి కుటుంబ సభ్యులను దాదాపు 9 వేల మందిని అధికారులు కనుగొన్నారు. గత 24 గంటల్లో దేశంలో కోవిడ్-19 కారణంగా కనీసం ఆరుగురు చనిపోయారు. 

దేశ రాజధాని ఢిల్లీలో 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 67 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 161 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 335 కరోనా కేసులు మరియు 16 మరణాలు సంభవించాయి. తమిళనాడులో కరోనా కేసలు బాగా పెరిగిపోయాయి. 309 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 124, తెలంగాణాలో 107 కేసులు ఉన్నాయి. 

గుజరాత్ లో 87, పంజాబ్ లో 46, ఉత్తర ప్రదేశ్ లో 113, మధ్యప్రదేశ్ లో 99, హర్యాణాలో 43, పశ్చిమ బెంగాల్ లో 53 కేసులు, చంఢీగర్ లో 16, ఛత్తీస్ ఘర్ లో 9, గోవా, హిమాచల్ ప్రదేశ్ లో ఆరుగురు, ఒడిశాలో ఐదుగురు కరోనా రోగులు ఉన్నారు. 

ప్రపంపచ బ్యాంక్ సాయం..

కరోనా వైరస్ మహమ్మారిని పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంక్ ఒక బిలియన్ డాలర్ల అత్యవసర నిధులను ఆమోదించింది. వైరస్ వ్యాప్తని తగ్గించడానికి భారతదేశం మూడు వారాల పాటు దేశ వ్యాప్తంగా లక్ డౌన్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా సామాజిక దూరాన్ని ఉల్లంఘించకుండా మరోసారి తమ ఐక్యతను చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా 10, 15,000 కరోనా కేసులు నమోదయ్యాయి. మరియు 53,000 మంది ఇప్పటికీ మరణించారు. 

Leave a Comment