‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ లతా మంగేష్కర్ కన్నుమూత..!

ప్రముఖ గాయనీ లతా మంగేష్కర్(92) కన్నుమూశారు. ఆదివారం ఉదయం ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దాదాపు నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించి మరణించారు. జనవరి 8న లతా మంగేష్కర్ కరోనాతో ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొన్నిరోజులు వెంటిలేటర్ పై ఆమె చికిత్స తీసుకున్నారు. ఈక్రమంలో ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు ప్రకటించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు ప్రతియ్నతించారు. కానీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి తుదిశ్వాస విడిచారు..

దేశం గర్వించే సింగర్ లతా మంగేష్కర్.. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ఆమెకు పేరుంది. 1942లో సింగర్ గా కెరీర్ ప్రారంభించిన లతా మంగేష్కర్ దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాణిగా వెలిగారు. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారతరత్నను పొందారు.  

లతా మంగేష్కర్ కి తెలుగు సనీ పరిశ్రమతోనూ అనుబంధం ఉంది. 1955లో ఏఎన్నార్ ‘సంతానం’ సినిమాలో నిదుర పోరా తమ్ముడా..1965లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ.. 1988లో నాగార్జున ఆఖరిపోరాటం సినిమాలో తెల్ల చీర పాట పాడారు. ఇక హిందీ సినీ ఇండస్ట్రీలో లతా మంగేష్కర్ పాటలు నేటికి అలరిస్తున్నాయి. అలాంటి లెజండరీ సింగర్ లేరన్న వార్తతో సినీ సంగీత అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు.  

Leave a Comment