8 నెలల చిన్నారి తలను నేలకు కొట్టి.. దారుణంగా కొట్టిన మహిళ.. ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న..!

గుజరాత్ లోని సూరత్ లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అభంశుభం తెలియని 8 నెలల పసికందును ఓ ఇంటి పనిమనిషి దారుణంగా కొట్టింది. దీంతో ఆ పసికందును వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్పించారు. పనిమినిషి చిన్నారిని కొడుతున్న దృశ్యాలు ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు ఆ పనిమనిషిని అదుపులోకి తీసుకున్నారు.  

వివరాల మేరకు.. సూరత్ లో ఓ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో.. చిన్నారులను చూసుకునేందుకు కళాబెన్ పటేల్ అనే సంరక్షకురాలిని నియమించుకున్నారు. అయితే ఇంట్లో తరుచూ పిల్లల ఏడుపులు వినిపిస్తుండటంతో పొరుగింటివారు ఇంటి యజమానికి చెప్పారు. 

దీంతో అనుమానంతో ఆ దంపతులు ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 8 నెలల చిన్నారిని విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఆ మహిళ చిన్నారిని తలను కింద కొట్టడం వీడియో కనిపించింది. అంతేకాదు ఆ చిన్నారి ఏడుస్తుంటే చెంపలపై కొడుతోంది.. 

ఇక ఉద్యోగాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు సీసీ టీవీ కెమెరాని పరిశీలించి షాక్ అయ్యారు. వెంటనే కేర్ టేకర్ పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కళాబెన్ పటేల్ పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి ఆమెను అరెస్ట్ చేశారు. కళాబెన్ కి ఐదేళ్ల క్రితం పెళ్లయిందని, ఇప్పటి వరకు ఆమెకు పిల్లలు కలగలేదని పోలీసులు తెలిపారు.  

Leave a Comment