ప్రపంచంలోనే అతి పెద్ద కారు..ఎక్కడైనా చూశారా..!

ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కారు.. దీని ముందు సాధారణ పెద్ద కార్లు సైతం బొమ్మలా కనిపిస్తాయి. ఏంటీ నమ్మడం లేదా? నిజమండీ.. సాధారణ హమ్మర్ ఎస్ యూవీ కారు చూస్తే వామ్మో ఇంత పెద్ద కారా అనిపిస్తుంది.. అలాంటిది.. దానికి మూడింతలు పెద్దదైనా ఈ H1X3 కారును చూస్తే వావ్ అనాల్సిందే.. ఈ కారు అంతపెద్దగా ఉంటుంది మరీ..
ఈ కారు 6.6 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు(21.6 x 46 x 19.6 అడుగులు). ఈ కారులో ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. సీట్లు పీకేసీ ఇల్లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఆఫ్ రోడ్ లో కూడా వేగంగా దూసుకెళ్తుందని ఈ కారు యజమాని హమద్ బిన్ హహ్దాన్ అల్ నహ్యాన్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే అది పెద్ద ఎస్ యూవీ కారు అని అన్నారు. మరీ ఈ కారు ఎలా ఉందో ఈ ఫొటోలు, వీడియో చూడండి..

 

Leave a Comment