హ్యాంగోవర్ ని ఇలా వదిలించుకోండి..

వీకెండ్ వస్తే చాలు.. ఫ్రెండ్స్ తో సిట్టింగ్ కూర్చోవడం సాధారణం.. మద్యం తాగుతూ.. స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు.. అయితే దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. మద్యం తాగడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టామినా.. కొందరికి తొందరగా కిక్కు ఎక్కితే.. మరికొందరికి కాస్త ఆలస్యంగా ఎక్కుతుంది. ఇక తెల్లారితే తెలుస్తోంది అసలు కిక్కు.. రాత్రి తాగిన హ్యాంగోవర్ దిగట్లేదు. అయితే హ్యాంగోవర్ దిగేందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

కొబ్బరి నీరు:

 హ్యాంగోవర్ ని వదిలించుకోవాడానికి కొబ్బరి నీరు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. హ్యాంగోవర్ దిగేందుకు ఉదయం కొబ్బరి నీళ్లు తాగాలి. 

నెయ్యి లేదా వెన్న:

హ్యాంగోవర్ తగ్గేందుకు నెయ్యి బాగా పనిచేస్తోంది. ఆహారంలో దేశీ నెయ్యి వేసుకొని తినడం వల్ల మత్తును వదిలించుకోవచ్చు. 

అల్లం:

అల్లం రసం కూడా హ్యాంగోవర్ ని తగ్గిస్తుంది. నీటిలో అల్లం రసం కలుపుకుని తాగడం తాగాలి. ఇది హ్యాంగోవర్ తగ్గించడంలో బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

నిమ్మకాయ:

మద్యం మత్తును వదిలించుకోవడానికి నిమ్మకాయ ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయం లేవగానే హ్యాంగోవర్ అనిపిస్తే.. నీటిలో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని తాగాలి. దీని వల్ల సాధారణ స్థితికి చేరుకోవచ్చు. నిమ్మ, నారింజ జ్యూస్ లను తాగడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. 

Leave a Comment