ఈ లేడీ ఆఫీసర్ ఓ కామపిశాచి.. జైల్లో ఖైదీలతోనే శృంగారం..!

ఆమె ఓ మహిళా పోలీస్ అధికారి.. జైల్లో ఖైదీలను సంరక్షించాల్సిన ఆమె వారితోనే కామకేళీలు సాగించింది. ఈ ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. ఈకేసులో కాలిఫోర్నియా ప్రెస్నో కౌంటీ సవరణ అధికారిణి టీనా గొంజాలెజ్(27)కు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

కాలిఫోర్నియా ప్రెస్నో కౌంటీ జైల్లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా టీనా గోంజాలెజ్ మూడేళ్ల పాటు పనిచేసింది. ఆ మూడేళ్లలో ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడింది. తనకు ఇష్టమొచ్చిన సమయంలో ఖైదీలతో శృంగార కార్యకలాపాల్లో మునిగితేలేదీ. 

నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాలని, ఫోన్ కాల్స్ లో శృంగార సంభాషణలు కొనసాగించాలని ఆమె ఖైదీలను బెదిరించేది. ఖైదీలపై తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఆమె ఘోరంగా ప్రవర్తించేది. ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు మిగితావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్ పెట్టేది. ఖైదీలకు పోర్న వీడియోలు చూపించి.. అలాగే చేయాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్ కు ఆమె రంధ్రాలు చేసుకునేది..

ఆమె వికృత చేష్టలపై కొందరు ఖైదీలు తెగించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసిన అధికారులు గత మే నెలలో అరెస్ట్ కూడా చేశారు. ఆమె రిపోర్టు చూసి జడ్జి సైతం విస్తుపోయారు. అంతేగాక ఖైదీలకు సెల్ ఫోన్లు, రేజర్లతో పాటు మద్యం, డ్రగ్స్ అందించేదని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు తెలిపాడు. ఆ సమయంలో గోంజాలెజ్ వైవాహిక జీవితం అర్ధాంతరంగా ముగిసిందని, ఆ బాధలోనే అలా ప్రవర్తించిందని నిందితురాలి తరపున కౌన్సిలర్ వాధించారు. 

ఇంతగి దారుణాలకు పాల్పడిన ఆమెను న్యాయమూర్తి ఒక కామ పిశాచిగా వర్ణించారు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్. మిగితా జీవితం అయినా మంచిగా బతుకు అని జడ్జి వ్యాఖ్యానించారు. ఆమెకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్షతో సరిపెట్టారు. అయితే ఇప్పటికే జైలులో గడిపినందుకు ఆ శిక్షను తగ్గించి మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధించారు.  

 

    

Leave a Comment