ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు..!

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ సడలింపుల్లో ప్రభుత్వం పలు మార్పలు చేసింది. ఏపీలో కర్ఫ్యూ సడలింపు ఈనెల 7న ముగియనుంది. ఈనేపథ్యంలో తాజా మార్పులను ప్రభుత్వం ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. 

మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఇచ్చింది. ఆ జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా కరోనా నిబంధనలతో రెస్టారెంట్లు, జిమ్ లు, కళ్యాణ మండపాలు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. 

అటు థియేటర్ల అనుమతికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా చూసుకోవాలని సూచించింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంం, భౌతిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్ వాడాలని సూచించింది.  

 

Leave a Comment