గుంటూరులో దారుణం.. ఈసీజీ కోసం వెళ్తే.. ల్యాబ్ లో యువతి బట్టలు విప్పించి.. ఫొటోలు తీశాడు..!

గుంటూరులోని ఓ ల్యాబ్ లో దారుణం జరిగింది. ఈసీజీ కోసం వచ్చిన యువతి పట్ల ల్యాబ్ టెక్నీషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు.. వివరాలు మేరకు పాత గుంటూరుకు చెందిన ఓ యువతి(19)కి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్ కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఈసీజీ తీయించుకోవాలని సూచించారు. 

దీంతో ఈసీజీ తీయించేందుకు ల్యాబ్ కి తీసుకెళ్లారు. అక్కడ టెక్నీషియన్ గా పనిచేస్తున్న హరీష్ యువతి తల్లిదండ్రులను బయటకు పంపించి ఈసీజీ తీసేందుకు తీసుకెళ్లాడు. ఈసీజీ తీయాలంటే దుస్తులు విప్పాలని యువతికి సూచించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దుస్తులు తీయకపోతే రిపోర్టులు సరిగ్గా రావని, ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని చెప్పాడు.

ఇక చేసేది లేక ఆ యువతి దుస్తులు విప్పి.. సిగ్గుతో కళ్లు మూసుకుంది. బల్లపై పడుకోమని చెప్పి హరీష్ తన మొబైల్ ఫోన్ ద్వారా ఫొటోలు తీశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేసింది. బయటకు వచ్చిన జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.     

Leave a Comment