పేరెంట్స్ జాగ్రత్త.. ఆడుకుంటూ నీటి బకెట్ లో పడి చిన్నారి మృతి..!

అప్పటి వరకు కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. ఆ ఇంట్లో అమ్మా అని పిలిచే గొంతు మూగబోయింది. పట్టీల చప్పుళ్లతో వేసే బుడి బుడి అడుగులు ఆగిపోయాయి. నీటితో నింపిన బకెట్ ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. నీటి బకెట్లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. 

వివరాల మేరకు మండలంలోని మిట్టపల్లె గ్రామానికి చెందిన వాణి, ఓబులేస్ దంపతులకు ఎంజెల్ రాణి(16) కూతురు ఉంది. రాణి ఆడుకుంటూ అక్కడే ఉన్న నీటి బకెట్ లో పడి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంట తడి పెట్టించాయి. అక్కడే ఉన్న తండ్రి ఓబులేసు, తాత చిన్నారి ఆడుకుంటుందని పట్టించుకోకపోవడంతో ఇంతటి ఘోరం జరిగిపోయింది.    

 

Leave a Comment