ప్రతిరోజూ వాము నీటిని తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా? 

వాము అంటే ఇండియాలో తెలియని వారుండరు.. సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించే మసాలా దినుసు.. వామును ఎన్నో రకాల వంటకాల్లో వాడుతూ వస్తున్నారు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలా మందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది. మరి వాములో ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణశక్తికి:

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వాము నీటిని తాగడం వల్ల అజీర్ణం సమస్య తగ్గుతుంది. రెండు టీ స్పూన్ల రోస్ట్ చేసిన వామును ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టండి. దీన్ని బాయిల్ చేసి చల్లారక తాగండి.. మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. హెవీ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా ఈ డ్రింక్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

బరువు తగ్గడానికి:

తిన్న ఆహారం జీర్ణం కాకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. అందులో బరువు పెరగడం కూడా ఒకటి. జీర్ణశక్తి సరిగ్గా ఉంటే బరువు పెరుగుదల నియంత్రణలోనే ఉంటుంది. కాబట్టీ ప్రతిరోజూ వాము వాటర్ ని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి..

ఉబ్బరాన్ని తగ్గిస్తుంది:

గర్భిణీ స్త్రీలలో మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్య సాధారణం. ఈ సమస్యలను నివారించడానికి.. ఒక గ్లాస్ నీటిలో వాము వేసి బాయిల్ చేయండి.. ఈ నీటిని ప్రతి రోజూ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 

అసిడిటీ తగ్గిస్తుంది:

జంక్ ఫుడ్, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల అసిడిటీ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను వాము ద్వారా నియంత్రించవచ్చు. మీ ఆహారంలో వామును చేర్చుకోవడం లేదా భోజనం తర్వాత వాము నీరు తాగడం వల్ల అసిడిటీ సమస్య తగ్గుతుంది.

దగ్గు, జలుబు నివారణకు:

కొన్ని తులసి ఆకులు మరియు ఒక టీ స్పూన్ వామును నీటిలో ఉడకబెట్టి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు సమస్య తగ్గుతుంది. ఇదీ శీఘ్ర ఫలితాలను ఇచ్చే ఇంటి చిట్కాగా చెప్పొచ్చు.

 

Leave a Comment