మంత్రి కేటీఆర్ వాహనానికే చలాన్.. ట్రాఫిక్ ఎస్సైని అభినందించిన కేటీఆర్..!

ట్రాఫిక్ రూల్స్ అందరికీ ఒక్కటే.. అది సామాన్యుడు అయినా.. మంత్రి అయినా.. అయితే కొందరు పోలీసులు సామాన్యులకు చలాను వేసి బెదిరిస్తారు.. అదే ప్రజాప్రతినిధులు అయితే గమ్మునుంటారు. అయితే ఈ పోలీస్ మాత్రం విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహించారు. రెండు రోజుల కింద ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వాహనానికే ట్రాఫిక్ చలాన్ విధించి నిజాయితీని నిరూపించుకున్నారు ట్రాఫిక్ ఎస్సై ఐలయ్య.. రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన విధించారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్రాఫిక్ ఎస్సై ఐలయ్యను అభినందించారు. తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజలకైనా.. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకైనా నిబంధనలు ఒకటే అని కేటీఆర్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ముందుంటానని, చాలన్ విధించిన రోజు సైతం తాను వాహనంలో లేనని చెప్పారు. తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్సై ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ లకు శాలువా కప్పి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన వాహనానికి విధించిన చలాన్ చెల్లించారు. 

Leave a Comment