షూటింగ్ లో ప్రమాదం.. హీరో రామ్ కి గాయాలు..!

హీరో రామ్ పోతినేని గాయపడ్డాడు. ఈ విషయాన్ని రామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన గాయాన్ని చూపిస్తూ ఓ ఫొటో షేర్ చేశారు. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ తన లుక్ ను పూర్తిగా మార్చుకుంటున్నాడు. బాడీని పెంచుకుంటున్నాడు.

 ఈక్రమంలో ఎక్సర్ సైజ్ చేస్తుండగా రామ్ మెడకు గాయాలపాలయ్యాడు. ‘రాపో 19’గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. రామ్ కి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమాలో కృతిషెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరిస్తున్నారు.. 

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఈమేజ్ తెచ్చుకున్నాడు రామ్.. దీంతో రామ్ ను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే లింగుసామి ఓ మాస్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తిచేసుకుంది. రామ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. అందుకు జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నాడు. వర్కవుట్స్ చేస్తుండగా రామ్ కు గాయమైంది. దీంతో రామ్ తొందరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.    

Leave a Comment