ఫేస్ బుక్, వాట్సాప్ డౌన్.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?.. కారణం అతడే?

ఫేస్ బుక్ ప్రపంచంలో ఉండే వారికి సోమవారం రాత్రి ఒక కాళరాత్రే అని చెప్పాలి. దాదాపు 7 గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయాయి. ఫేస్ బుక్ తో పాటు వాట్సాప్, ఇన్ స్టా, అమెరికన్ టెలికాం కంపెనీలైన వెరిజోన్, ఎట్ అండ్ టీ, టీ మొబైల్ కూడా గంటల తరబడి నిలిచిపోయాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ సేవలకు అంతరాయం కలిగింది.  

ఫేస్ బుక్ దాని అనుబంధ సేవల సర్వీసులు డౌన్ కావడం వల్ల దాని వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జూకర్ బర్గ్ భారీ నష్టాన్ని చవిచూశాడు. సుమారు 7 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో దాదాపు రూ.50 వేల కోట్లకు పైనే) నష్టం వాటిల్లింది. ఆయన బిలియనీర్ల జాబాతాలో ఒక స్థానాన్ని కోల్పోయారు. ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకున్నారు. సెప్టెంబర్ లో ఫేస్ బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా.. సోమవారం ఒక్కరోజే 5 శాతం పడిపోయినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. దీంతో 120.9 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ తర్వాత అపర కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు మార్క్ జూకర్ బర్గ..  ఫేస్ బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం ఇదే ఫస్ట్ టైం.. 

దీనికి కారనం ఎవరూ?

ఫేస్ బుక్ సేవలకు అంతరాయం కలిగినప్పుడు రకరకాల అనుమానాలు వచ్చాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘నెగిటివ్’ కథనం ప్రభావం వల్ల జరిగిందని, లేదు హ్యాకర్ల పని అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే డొమైన్ నేమ్ సిస్టమ్ లో సమస్య తలెత్తడం వల్లే సమస్య వచ్చిందని మొదట భావించారు. కానీ బీజీపీ(బార్డర్ గేట్ వే ప్రొటొకాల్) ను ఓ ఉద్యోగి మ్యానువల్ గా అప్ లోడ్ చేయడం వల్లే ఈ భారీ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.. 

క్షమించండి: జూకర్ బర్గ్

ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలిగించినందుకు చింతిస్తూ ఫేస్ బుక్ సీఈవో జూకర్ బర్గ్ క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ మూడు నెటిజన్లకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మీ ఇష్టమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటానికి వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పై ఎంత ఆధారపడతారో తమకు తెలుసని, ఈ అంతరాయం కలిగించినందుకు క్షమించండి అని మార్క్ జూకర్ బర్త్ కోరారు. 

 

Leave a Comment