కోలికోడ్ విమాన ప్రమాదం – మృతుల్లో ఒకరికి కరోనా

కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న కాళికట్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం కోళీకోడ్ ఎయిర్ పోర్ట్ లో దిగుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. భారీ వర్షం కారణంగా రన్ వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న 50 అడుగుల లోతైన లోయలో పడింది. దీంతో ఆ బీ737 విమానం రెండు ముక్కలైంది. ఈ విమానంలో 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారు. వారిలో 10 మంది చిన్నారులు ఉన్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. 

ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా 19 మంది మరణించారు. 23 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరణించిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేరళ మంత్రి కేటీ జలీల్ వెల్లడించారు. చిన్నపాటి గాయాలతో బయటపడిన సుమారు 20 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేసినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. 

Leave a Comment