41 ఏళ్ల వయసులో క్రికెట్.. ప్రవీణ్ తాంబే బయోపిక్ చూసి కోల్ కతా ప్లేయర్స్ భావోద్వేగం..!

ప్రవీణ్ తాంబే.. చాలా మందికి ఈ పేరు తెలియదు.. కొంత మంది క్రికెట్ లవర్స్ కి మాత్రం ఈపేరును విని ఉంటారు.. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడాడు. ప్రవీణ్ తాంబే తన కెరీర్ లో కేవలం రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లను మాత్రమే ఆడాడు. అసలు ప్రవీణ్ తాంబే ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచారనేగా మీ సందేహం.. 

ఎందుకంటే ప్రవీణ్ తాంబే జీవితం ఆధారంగా బయోపిక్ రావడమే.. ‘కౌన్ ప్రవీణ్ తాంబే?’ సినిమా ఏప్రిల్ 1 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.. క్రికెట్ కోసం చిన్నప్పటి నుంచి కష్టపడిన ప్రవీణ్ తాంబే ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నాడు. అయితే టీమిండియా తరఫున మాత్రం ఆడలేకపోయాడు. అయినా ఐపీఎల్ సహా కొన్ని టీ20 లీగుల్లో ప్రాతినిథ్యం వహించాడు. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. 

ఈనేపథ్యంలో వచ్చిన ప్రవీణ్ తాంబే బయోపిక్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోందది. ఈ సందర్భంగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన కేకేఆర్ ప్లేయర్స్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పదర్శనకు ప్రవీణ్ తాంబే కోల్ కతా ఆటగాళ్లతో కలిసి చూశారు. షో తర్వాత ప్రవీణ్ ఎమోషనల్ అయ్యారు. కోల్ కతా ఆటగాళ్లు ప్రవీణ్ తాంబేను అభినందించారు. కలలు సాకారం అయ్యేంత వరకు వాటిని అస్సలు వదులుకోవద్దని కోల్ కతా ప్లేయర్లకు సందేశమిచ్చారు. 

Leave a Comment