శ్రీలంకలో ఎమర్జెన్సీ.. కారణం అదేనా..!

శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఎమర్జెన్సీ విధించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని గెజిట్ జారీ చేశారు. శ్రీలంకలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళలను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలుస్తోంది..

శ్రీలంలో గత కొన్ని రోజులు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. అంతేకాదు ఆహార పదార్థాల కొరత, విద్యుత్ కోతలు, ఇంధన కొరతతో శ్రీలంకలో ప్రజలు రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. 

ఈనేపథ్యంలో గురువారం రాత్రి వేలాది మంది శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స నివాస భవనాన్ని చుట్టుముట్టారు. శ్రీలంక అధ్యక్ష పదవీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో నిరసన కారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ను విడుదల చేశారు. ఈక్రమంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. 

ఈనేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స గెజిట్ జారీ చేశారు. దేశ ప్రజల భద్రత, అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరా నేపథ్యంలో ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు రాజపక్స వెల్లడించారు.    

 

Leave a Comment